పోయి రావమ్మా
పసిడి తంగేళ్ల మెరుపులతోటి గునుగు గుత్తుల కులుకులతోటి
పసిడి తంగేళ్ల మెరుపులతోటి
గునుగు గుత్తుల కులుకులతోటి
గుమ్మడి పువ్వుల నవ్వులతోటి
సిబ్బిలో నిన్ను అమిర్చి ఉంచి
రంగుల పూలను చుట్టూ చేర్చి
గోపురమోలే తీర్చిదిద్ది
పసుపు ముద్దను గౌరిగ చేసి
పైభాగాన కూర్చోబెట్టి
మట్టి పరిమళం జాతి జీవనం
ప్రతిబింబించే అమ్మవు నీవని
బాలలు మగువలు గుంపుగ కూడి
చేతిగాజులు గలగలలాడగ
కాలి అందెలు సవ్వడి చేయగ
లయతో కూడిన ఆటలతోటి
బతుకు గాథల పాటలతోటి
తొమ్మిది రోజులు నిత్యము కొలిచి
తొమ్మిదోనాడు సద్దులు చేసి
చీరెలు సారెలు ఘనముగ పెట్టి
పసుపు కుంకుమలు అక్షింతలతో
ధూపదీపాలు నైవేద్యాలతో
హారతులిచ్చి నీటిలో ఒదిలి
సమత మమతల సంపదలిచ్చి
సవాళ్లతోటి సమరం చేస్తూ
విజయంవైపు అడుగులు వేస్తూ
అందరు హాయిగ ఉండాలంటూ
మనిషితనమును మరవొద్దంటూ
ఆత్మగౌరవం వదలొద్దంటూ
బతుకుతూ బతుకును ఇవ్వాలంటూ
సుద్దులు బుద్ధులు మస్తుగ చెప్పి
నిండుగ మెండుగ దీవెనలిచ్చే
తల్లివి నీవని భక్తితో మొక్కి
సాగనంపేటి సమయము వచ్చె
పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా
మళ్లీరా గౌరమ్మ మళ్లీ రావమ్మా
మళ్లీరా గౌరమ్మ మళ్లీ రావమ్మా!
డా.కొమర్రాజు
రామలక్ష్మి
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

