ఖమ్మం : అర్మీ రవి అనే యువకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అహంకారంపై దెబ్బకొట్టాడని, ఆ తమ్ముడిని తాను అభినందిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ సర్పంచులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. సర్పంచులుగా గెలిచిన అందరినీ ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఆర్మీ రవికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఆర్మీ రవి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు, పోలీసుల వేధింపులను భరించలేక ఒకానొక దశలో ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. జనాల్లో ఉన్న రవిని పిలిచి మరీ అభినందించారు. మంత్రి, ఆయన మనుషులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆర్మీ రవి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిచి పొంగులేటి అహంకారంపై దెబ్బ కొట్టాడని మెచ్చుకున్నారు.
ఈ విషయం కేవలం ఒక్క రవి విజయం మాత్రమే కాదని, తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ దమనకాండను ఎదిరించి, ప్రజాస్వామ్యబద్ధంగా విజయం సాధించిన ఎందరో పోరాట యోధుల గెలుపు అని కొనియాడారు.