Tattoo | బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న కృతి సనన్ కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి.. ఆ తర్వాత నాగచైతన్యతో ‘దోచేయ్’, ప్రభాస్తో ‘రామాయణం’ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే, ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో పూర్తిగా స్థిరపడిపోయింది.తాజాగా కృతి సనన్ ఒక కొత్త టాటూ వేయించుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తొలిసారిగా తను వేసుకున్న టాటూ గురించి ఎంతో ఆసక్తికరంగా వివరించింది.
తన కాలు మీద ఎగిరే పక్షి టాటూ వేయించుకున్న కృతి.. దాని కింద ఒక ప్రేరణాత్మక కోట్ కూడా రాసుకుంది. ఈ టాటూ వెనుక ఉన్న భావాన్ని ఆమె ఇలా వివరించింది. “నేను టాటూ వేయించుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడే తొలిసారి వేసుకున్నాను. నా వాగ్దానం నెరవేరింది. ఈ పక్షిలాగే, నేను కూడా స్వేచ్ఛగా, ఉదయం సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ నా జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. కళ్లలో కలలు ఉన్నవారు.. మీరు భయపడే ఆ ఎత్తును అంగీకరించాలి. అది సులభం కాదు. కానీ మీ మార్గాన్ని మీరు కనుగొంటారు. ఎగరడం నేర్చుకుంటారు. ముందడుగు వేయాలి” అంటూ ఆమె తన టాటూ వెనుక భావాన్ని వ్యక్తం చేసింది.
కృతి సనన్ భావోద్వేగాత్మక టాటూ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఆమె సాహసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన ముద్ర వేసుకుంటోంది.ఈ అమ్మడి పెళ్లి గురించి కూడా కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య ప్రభాస్తో ప్రేమలో ఉందనే ప్రచారం జరగ్గా దానిని ఖండించారు. బాలీవుడ్ మీడియా ప్రకారం ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్టు తెలుస్తుంది.