అదుపు తప్పిన రెడీమిక్స్.. మూడు కార్లు ధ్వంసం
కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 27 : రెడీమిక్స్ వాహనం బీభత్సం స్పష్టించింది. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. స్థానికులు, కేపీహెచ్‌కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన రెడ్‌మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) వాహనం సోమవారం బాచుపల్లి నుంచి జూబ్లీహిల్స్‌కు వెళ్తుండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్ సమీపంలో ఆర్వోబీ వద్ద బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. దీంతో ముందుగా వెళ్తున్న కారును ఢీకొట్టగా, ఆ వాహనం మరో కారును ధ్వంసం చేసింది. ఈ క్రమంలోనే ‘ఆర్ఎంసీ’ రోడ్డుపై డివైడర్‌ను దాటి మరో వైపునకు దూసుకెళ్లగా, ఆ రోడ్డులో వెళ్తున్న కారు సైతం దెబ్బతింది.