నుమాయిష్ లేనట్లే..!
- కరోనా నేపథ్యంలో మూసివేయాలని కొత్వాల్ ఆదేశాలు

అబిడ్స్, జనవరి 6 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)ను మూసి వేయాలని నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఎగ్జిబిషన్‌ను మూసివేస్తున్నట్లు మైదానంలో మైకుల ద్వారా ప్రకటించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నుమాయిష్ ఉండదు. 2020లో కరోనా నేపథ్యంలో ఎగ్జిబిషన్ నిర్వాహణకు అనుమతి లభించలేదు. దీంతో గత సంవత్సరం నుమాయిష్‌ను నిర్వహించ లేకపోయారు. కాగా ఈ సంవత్సరం అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులు లభించడంతో జనవరి 1న 1500 స్టాల్లతో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
ఇదిలా ఉండగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పబ్లిక్ సమావేశాలు, జనం గుంపులుగా ఉండడం, ర్యాలీలను నిషేధిస్తూ జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఎగ్జిబిషన్ ప్రారంభమైన రెండో రోజే పోలీసులు ఎగ్జిబిషన్ నిర్వహించరాదని ఆదేశించడంతో సొసైటీ ప్రతినిధులు ఈ నెల 10 వరకు వాయిదా వేశారు. అయితే అంతలోపే నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కరోనా, ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎగ్జిబిషన్‌ను ముందు జాగ్రత్త చర్యగా తక్షణమే నిలిపివేయాలని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రభాశంకర్, కార్యదర్శి ఆదిత్యమార్గంలకు నోటీసులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు ఎగ్జిబిషన్‌ను నిలిపి వేస్తున్నట్లు మైకుల ద్వారా ప్రచారం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
- Kotwalguda
RELATED ARTICLES
తాజా వార్తలు
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

