అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ బ్యాట్‌తో రాణించడంలో విఫలమయ్యాడు. భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ దారుణ ప్రదర్శనతో కోహ్లీసేన ఓటమిపాలైంది. ఐతే ఫీల్డింగ్‌లో మాత్రం రాహుల్ అదరగొట్టాడు.
భారత్ నిర్దేశించిన స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. అక్షర్ పటేల్ వేసిన నాలుగో ఓవర్లో బట్లర్ భారీ షాట్ ఆడాడు. సిక్స్ వెళ్లే బంతిని డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ బౌండరీ లైన్ బయటకు గాల్లో ఎగురుతూ బంతిని అందుకొని లోపలికి విసిరేశాడు. సూపర్ మ్యాన్ తరహాలో డైవ్ చేసిన రాహుల్ ఫీల్డింగ్ విన్యాసం నెటిజన్లను ఆకట్టుకున్నది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
Amazing fielding by KL Rahul #IndiavsEngland #INDvsEND #1stT20 pic.twitter.com/NebyVSkGDl
— Secret Superstar (@InstaSSKKL) March 12, 2021