అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో దారుణ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. అతనొక ఛాంపియన్ ప్లేయర్ అని అభివర్ణించాడు. పొట్టి ఫార్మాట్లో రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయగల ఉత్తమ బ్యాట్స్‌మన్ రాహుల్ అని పేర్నొన్నాడు. గత మూడు టీ20ల్లో రాహుల్ వరుసగా 1, 0, 0 పరుగులతో నిరాశపరిచిన విషయం తెలిసిందే.
‘రెండు రోజుల క్రితం వరకు నేను విఫలమయ్యాను. అతను(రాహుల్) ఛాంపియన్ ఆటగాడు. టాప్ ఆర్డర్లో రోహిత్‌తో పాటు రాహుల్ కూడా మా జట్టు ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతాడు’ అని మ్యాచ్ అనంతరం కోహ్లీ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో ఐదు-ఆరు బంతుల్లోనే అంతా మారిపోతుందని కోహ్లీ అన్నాడు. మంగళవారం జరిగిన మూడో టీ20లో గెలిచిన ఇంగ్లాండ్ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది.