AP Minister : ఎవరినైనా ‘చంపు.. దోచుకో.. దాచుకో’ అనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని ఏపీ మంత్రి సంధ్యారాణి అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు జగన్ అండ ఉందనే సుబ్రహ్మణ్యంను హత్యచేసి డోర్ డెలివరీ చేశారని ఆమె ఆరోపించారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులు చనిపోతున్నట్లే.. సుబ్రహ్మణ్యం కేసులోనూ చనిపోతున్నారని అన్నారు. హత్యలు చేయడం, ఆ హత్యలకు సాక్షులుగా ఉన్న వారిని చంపడం వైఎస్ఆర్ నైజమని విమర్శించారు.
సొంత చిన్నాన్నను చంపించిన వారికి సాక్షులను చంపించడం పెద్ద విషయమా..? అని మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. ఇటీవల హత్యకు గురైన పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని ఆమె ప్రశ్నించారు. పరామర్శకు వెళ్తే చొక్కా పట్టుకొని ప్రశ్నిస్తారన్న భయంతోనే జగన్ వెళ్లట్లేదన్నారు. అమ్మను, అమరావతిని, ఆంధ్రప్రదేశ్‌ను జగన్ తప్ప ప్రజలంతా ఇష్టపడతారని వ్యాఖ్యానించారు. జగన్ మానసిక వికలాంగుడు అని చాటుకునేందుకే రాజధానికి మావిగన్ అనే పేరును ప్రతిపాదించారని ఎద్దేవా చేశారు.