Tragedy | ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. రేపే ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మద్దులపల్లి స్టేజ్ వద్ద ఉన్న కిరాణషాపుకు వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన గొడ్డు గొర్ల ప్రసాద్(28) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అతనికి వివాహం కూడా నిశ్చయమైంది. గురువారం నాడు నిశ్చితార్థం కావాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మద్దులపల్లి స్టేజ్ వద్ద ఉన్న కిరాణ షాపునకు ప్రసాద్ వెళ్లాడు. తిరిగి ఇంటికొచ్చేప్పుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు ప్రసాద్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రసాద్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, రేపు నిశ్చితార్థం చేసుకోవాల్సిన యువకుడు.. ఇలా పాడే ఎక్కడంతో మద్దులపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సీసీటీవీ ఫుటేజ్
రేపు నిశ్చితార్థం.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఖమ్మం జిల్లా మద్దులపల్లి స్టేజ్ వద్ద రోడ్డు దాటుతున్న ప్రసాద్(28) అనే యువకుడిని, అతి వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు
తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ప్రసాద్
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు… pic.twitter.com/ChjkOc9ZBf
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2026