కారేపల్లి, జూన్ 8 : ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. జామల్లపల్లిలో ఇటీవల గాలిదుమారానికి ఇండ్లు కూలిన వారి కుటుంబాలను బుధవారం కలిసి పరామర్శించి బాధిత కుటుంబాలకు బియ్యం, ఆర్థిక సాయాన్ని అందజేశారు. అదే విధంగా ఇండ్లు కూలి నిరాశ్రయులైన వారికి డబుల్‌బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడిబాటలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేసి మాట్లాడారు. టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తోటకూరి రాంబాబు, ఆజ్మీరా వీరన్న, మల్లెల నాగేశ్వరరావు, ఇమ్మడి తిరుపతిరావు, పెద్దబోయిన ఉమాశంకర్, బానోత్ కుమార్, అజ్మీర నాగేశ్వరరావు, అడ్డగోడ ఐలయ్య, మర్సకట్ల రోశయ్య, పప్పుల నిర్మల, మౌలాలి, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో ఎం.చంద్రశేఖర్, విద్యుత్ ఏఈ విజయ్‌కుమార్, అంగన్వాడీ టీచర్ డేగమాంబ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, జూన్8 : టీఆర్ఎస్ నాయకుడు ఏలూరి శ్రీనివాసరావు అత్త వంకిన కృష్ణకుమారి పెద్దకర్మ బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరి దయాకర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఎంపీ నామా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయ ఇన్చార్జి కనకమేడల సత్యనారాయణ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఎంపీపీ మధు తదితరులు పాల్గొన్నారు.