కొత్తగూడెం టౌన్, ఏప్రిల్ 17 : జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఎంజీరోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విధ డయాగ్నస్టిక్ సెంటర్‌ను సింగరేణి డైరెక్టర్(పా) ఎన్.బలరాం, ఖమ్మం అంకుర ఆస్పత్రి ఎండీ కృష్ణప్రసాదరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ దయానందస్వామి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. కొత్తగూడెం, భద్రాచలం చుట్టుపక్కల ప్రజలు ఖమ్మం, హైదరాబాద్ లాంటి దూరప్రాంతాలకు వెళ్తున్నారని అలాంటి వారికి విధ డయాగ్నస్టిక్ సేవలు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ఎల్ లక్ష్మణ్‌రావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కేకే వర్ధన్‌రావు, సీనియర్ సర్జన్ డాక్టర్ రమేశ్‌బాబు, డాక్టర్ రమేశ్, డాక్టర్ పూర్ణచంద్రరావు, డాక్టర్ భాస్కర్, రంగారావు, డాక్టర్ మోహన్‌బాబు, డాక్టర్ చల్లగుళ్ల రాకేశ్ పాల్గొన్నారు.