Vemulawada |వేములవాడ, జూన్ 20: మాజీ మంత్రి కేటీఆర్ పై అర్థంలేని ఆరోపణలు చేస్తే ఖబర్దార్ గజ్జలకాంతం అని వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వేములవాడలో విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ నిమశెట్టి విజయ్ శుక్రవారం మాట్లాడుతూ కేటీఆర్ తెలంగాణ యువత యువతకు ఐకాన్, హైదరాబాద్ ఐటి పరిశ్రమను అభివృద్ధి చేసి ప్రపంచానికి చూపిన ఘనుడని అన్నారు.
నాడు మంత్రి కొండా సురేఖ, నేడు నువ్వు ఇదేనా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల సంస్కృతి అని ప్రశ్నించారు. తల్లి లాంటి మహిళల పట్ల అర్థం లేని ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు దర్శనం అన్నారు. ఆధారాలు ఉంటే మీడియా ద్వారా బయట పెట్టు కానీ మా నాయకుని పై అర్థం లేని విమర్శలు చేస్తే ఖబర్దార్ రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ప్రజా సంఘాల పేరుతో నువ్వు చేస్తున్న బ్లాక్మెయిల్ రాజకీయాలు మాకు తెలుసునని హెచ్చరించారు.
మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను నీచ సంస్కృతి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు జోగిని శంకర్, సిరిగిరి రామచందర్, కుమ్మరి శ్రీనివాస్, మాజీ సర్పంచులు సుమన్, తిరుపతి, నాయకులు దమ్మ భాస్కర్, కిరణ్, సందీప్ తదితరులు ఉన్నారు.