నాగపూర్: రంజీ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో ముంబై జట్టు ఓటమి పాలైంది. 80 రన్స్ తేడాతో విదర్భ విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. 406 రన్స్ టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ఆడిన ముంబై జట్టు.. ఇవాళ అయిదో రోజు 325 రన్స్ చేసి ఆలౌటైంది. ముంబై జట్టులో శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీ చేశాడు. విదర్భ బౌలర్ హర్ష్ దూబే.. తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. విదర్భ ఫస్ట్ ఇన్నింగ్స్లో 383, రెండో ఇన్నింగ్స్లో 292 రన్స్ చేసింది. అయితే ముంబై తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 270 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది.
A special moment for Kerala 👌
They have qualified for the final for the first time in the #RanjiTrophy 👏
It’s Vidarbha vs Kerala in the final showdown 🔥
Scorecard ▶️ https://t.co/kisimA9o9w#RanjiTrophy | @IDFCFIRSTBank | #GUJvKER | #SF1 pic.twitter.com/VCasFTzbB7
— BCCI Domestic (@BCCIdomestic) February 21, 2025
ఇక గుజరాత్, కేరళ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ డ్రా అయ్యింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో కేరళ ఆధిక్యం సాధించడం వల్ల ఆ జట్టు ఫైనల్కు క్వాలిఫై అయ్యింది. రంజీ చరిత్రలో తొలిసారి కేరళ ఫైనల్కు ఎంట్రీ ఇచ్చింది. కేరళ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం రెండు పరుగుల ఆధిక్యం మాత్రమే సాధించింది. కానీ లీడ్ వల్ల ఆ జట్టు ఫైనల్కు ప్రవేశించింది. కేరళ తొలి ఇన్నింగ్స్లో 457 , రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 114 రన్స్ చేసింది. గుజరాత్ తన తొలి ఇన్నింగ్స్లో 455 రన్స్ చేసింది.
ఫిబ్రవరి 26వ తేదీ నుంచి కేరళ, విదర్భ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్నది.