సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తన పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఇవాళ కేరళం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. సర్ ఓటర్ల జాబితా వివాదంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కోరింది. కేరళం సీఎం వీడీ సతీశన్ నేతృత్వంలో కేరళ అసెంబ్లీలో తీర్మానాన్ని పాస్ చేశారు.
న్యూఢిల్లీ: చీఫ్ ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తన పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఇవాళ కేరళం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. సర్ ఓటర్ల జాబితా వివాదంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కోరింది. సీఈసీ జ్ఞానేశ్‌ను తొలగించాలని కోరుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేరళం సీఎం వీడీ సతీశన్ నేతృత్వంలో కేరళ అసెంబ్లీలో తీర్మానాన్ని పాస్ చేశారు. ఓటర్ రోల్ రివిజన్లో తీవ్ర అక్రమాలు జరిగినట్లు తీర్మానంలో ఆరోపించారు. అర్హులైన ఓటర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించినట్లు తీర్మానంలో తెలిపారు. దీన్ని సహించకూడదని అన్నారు.
సర్‌లో జరిగిన అక్రమాలను సరి చేయాలని తీర్మానంలో కోరారు. తప్పుడు పద్ధతిలో ఓట్లు తొలగించిన అర్హులైన ఓటర్ల ఓటింగ్ హక్కును తక్షణమే పునరుద్దరించాలని తీర్మానంలో కోరారు. ఎన్నికల కమీషనర్ల సెలక్షన్ కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐని కూడా సభ్యులుగా చేర్చుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలకు కేరళం మద్దతు ఇస్తుందని సీఎం సతీశన్ తన ఎక్స్ పోస్టులో తెలిపారు.
In a historic move, the Keralam Legislative Assembly passed a resolution seeking the removal of the Chief Election Commissioner.
#Keralam https://t.co/wUiuY6QZkV
— Chief Minister, Keralam (@CMOkeralam) October 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

