Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Jantar Mantar | దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు నిరసనలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్‌ను ఇకపై దాని కోసం వినియోగించడానికి వీలు లేదు. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలను నిర్దేశించారు. తూర్పు ఢిల్లీలోని రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్ నిరసనల వేదికలు కానున్నాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు నిరసనలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్‌ను ఇకపై దాని కోసం వినియోగించడానికి వీలు లేదు. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలను నిర్దేశించారు. తూర్పు ఢిల్లీలోని రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్ నిరసనల వేదికలు కానున్నాయి. (Jantar Mantar) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక కమిటీ సిఫార్సుల ఆధారంగా వీటిని ఖరారు చేశారు.
కాగా, జంతర్ మంతర్‌ను నిరసనలకు నిర్దేశిత ప్రదేశంగా గుర్తించే హోదాను రద్దు చేస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘కమిటీ సిఫార్సుల ఆధారంగా, నిరసన వేదికగా జంతర్ మంతర్‌కు ఉన్న గుర్తింపును రద్దు చేశారు. నిరసనలు లేదా ప్రదర్శనలు నిర్వహించడానికి రామ్‌లీలా మైదానం, బురారీ మైదానం, సీబీడీ మైదానం అనే మూడు కొత్త ప్రదేశాలను నిర్దేశించారు’ అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ మూడు కొత్త ప్రదేశాలలో నిరసనలు నిర్వహించడానికి సంబంధించిన ప్రామాణిక కార్యనిర్వహణ విధానాలను వేర్వేరుగా జారీ చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మరోవైపు ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (సర్) వివాదంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షాలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలను ఉధృతం చేశాయి. దీంతో గత రెండు రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడకు చేరుకుంటున్న వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు నిరసనలకు వేదికగా ఉన్న జంతర్ మంతర్‌కు ఆ గుర్తింపును రద్దు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించే అవకాశమున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

