హనుమకొండ, నవంబర్ 12: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ -2 వాలంటీర్ ఉప్పల శివ గుజరాత్లోని రామచంద్ర నార్త్ గుజరాత్ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు జరిగిన ప్రీ రిపబ్లిక్ డే శిక్షణ శిబిరంలో పాల్గొని శిక్షణపూర్తి చేసుకొని తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్ శిక్షణ సర్టిఫికెట్ అందజేసి అభినందించారు. ఈ శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులు జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనటానికి ఎంపికవుతారన్నారు.
ఈ అవకాశం కేడీసీ విద్యార్థికి శివకు రావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు సీతారాములు, గంగిశెట్టి శ్రీనివాస్, ఘన్సింగ్, వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ శ్రీనాథ్, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ రవికుమార్, సీనియర్ అధ్యాపకులు కవిత, రవీందర్, చిన్న, వెంకన్న, వెంకటరమణ, సమ్మయ్య, దినకర్, ప్రదీప్, శ్రవణ్, రాంరెడ్డి పాల్గొని శివకు అభినందనలు తెలిపారు.