హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో ఆయన అసెంబ్లీకి చేరుకోనున్నారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. కేసీఆర్ తుంటి ఎముకకు ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ హాజరుకావాల్సిందిగా సమాచారం అందించారు.