హైదరాబాద్, ఆగస్టు12 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ కవయిత్రి, అభ్యుదయ స్త్రీవాద రచయిత్రి అనిశెట్టి రజిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని, పీడిత వర్గాల పట్ల సామాజిక బాధ్యతతో కూడిన సాహిత్యాన్ని అందించిన వరంగల్ బిడ్డ అనిశెట్టి రజిత మరణం తెలంగాణకు తీరనిలోటన్నారు.
తెలంగాణ గొప్ప ప్రజాస్వామిక సాహితీవేత్తను కోల్పోయిందని పేర్కొన్నారు. వారి అకాల మరణంతో శోకతప్తులైన బంధు మిత్రులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.