కొండమల్లేపల్లి, మార్చి 1: ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ తరహా పాలన కావాలని సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని ఏపీలోని గుంటూరు జిల్లా రెంటచింతల గ్రామ సమీపంలోని ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. రెంటచింతలకు చెందిన కేసీఆర్ అభిమాని గోగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మహాశివరాత్రి సందర్భంగా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్ కుటుంబ సభ్యులతో కోటప్పకొండకు వెళ్తుండగా ఈ ఫ్లెక్సీ కనిపించింది.