KCR : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు(KCR) సంతాపం ప్రకటించారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా పనిచేసిన ముద్రగడ గొప్ప ప్రజా నాయకుడని, ముఖ్యంగా కాపు వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన కృషి గొప్పదని కేసీఆర్ అన్నారు.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపులు, అనుబంధ కులాలకు అందించాలని ముద్రగడం పద్మనాభం తపించారని కేసీఆర్ గుర్తు చేశారు. తాను నమ్మిన సిద్దాంతం కోసం జీవితకాలం రాజీలేని పోరాటం చేసిన ప్రత్యామ్న్యాయ రాజకీయ వేత్తఅని ముద్రగడను కేసీఆర్ కొనియాడారు. వారి మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్న గులాబీ అధినేత.. శోకతప్తులైన ముద్రగడ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.