Family Suicide | కుటుంబం బలవన్మరణం కేసులో షాకింగ్ విషయాలు.. రూ.75 లక్షలకు భారీ డీల్.. !
Family Suicide | ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గూడ్స్ రైలు కిందపడి కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో బావ శ్రీహరి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వహిస్తూ తన బావమరిది హరికృష్ణను నమ్మి కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చాడు.
Family Suicide | ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గూడ్స్ రైలు కిందపడి కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. బావ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బావమరిది హరికృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తాజా కథనాల ప్రకారం.. బావ శ్రీహరి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వహిస్తూ తన బావమరిది హరికృష్ణను నమ్మి కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చాడు. అయితే ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలని శ్రీహరి కోరడంతో బావమరిది హరికృష్ణ అతన్ని అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం ఇద్దరికి సుపారీ ఇచ్చి.. జూన్ 15న పెంచలకోనకు కారులో తీసుకెళ్లాడు. తిరిగి వస్తుండగా అప్పటికే దారిలో మాటు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు వీరి కారును ఆపి, శ్రీహరికి కుక్కలను చంపే ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేశాడు. బావ శ్రీహరి గుండెపోటుతో చనిపోయాడని హరికృష్ణ తెలుపగా.. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో శ్రీహరి భార్య లావణ్య తన భర్త హత్యకు గురయ్యాడని ఎస్పీకి జూలై 6న ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసుల అవినీతి బయటపడ్డది.
డైవర్షన్ కోసం భారీ డీల్..
హత్యను పక్కదారి పట్టించేందుకు హరికృష్ణ రూ.75 లక్షలకు కుదిరిన భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తేలింది. ఓ పోలీస్ ఉన్నతాధికారి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా ఉండడానికి రూ.25 లక్షలు తీసుకోగా.. కిందిస్థాయి పోలీసులకు, స్థానిక రాజకీయ నాయకులకు, ఇతరులకు రూ.50 లక్షలు పంచినట్టు నిర్దారణ అయింది. కేసును పక్కదారి పట్టించినందుకు సీఐతోపాటు స్టేషన్లో ఉన్న 23 మందిపై ఎస్పీ బదిలీ వేటు వేశారు. సీఐను వీఆర్‌కు పంపి, సస్పెండ్ చేయాలని సిఫార్సు చేశారు. ఇదిలా ఉండగా పరారీలో ఉన్న హరికృష్ణ మంగళవారం రైలు కిందపడి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గూడ్స్ రైలు కిందపడి కుటుంబం బలవన్మరణం ఘటనలో విస్తుపోయే విషయాలు
బావ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బావమరిది హరికృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి బలవన్మరణం
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండల వ్యవసాయాధికారిగా విధులు… https://t.co/X6uy1tTvv3 pic.twitter.com/LWnswkn2FI
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2026
Read ALso :
Anil Menon | ఈ రాత్రే అంతరిక్ష యాత్రకు అనిల్ మీనన్.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తిరిగి భూమికి
Watch: కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం.. వైరల్ వీడియోపై రైల్వే వివరణ
Raaka | ‘రాకా’లో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెంచిన నైలా గ్రేవల్ !
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

