ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో మరో పేస్ అస్త్రం.. పునరాగమనం అదిరేనా..!
ECB : దాదాపు ఏడాది కాలంగా వన్డేలకు దూరమైన ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్సేBrydon Carse) మళ్లీ స్క్వాడ్‌లోకి వచ్చాడు. రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడు.
ECB : దాదాపు ఏడాది కాలంగా వన్డేలకు దూరమైన ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్సేBrydon Carse) మళ్లీ స్క్వాడ్‌లోకి వచ్చాడు. స్వదేశంలో భారత జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతుండగానే అతడిని స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు. గాయం నుంచి కోలుకున్న కార్సే ఈమధ్యే డుర్హం జట్టు తరఫున మూడు టీ20లు ఆడాడు. పునరాగమనం సిరీస్‌లో అదరగొట్టాలని భావిస్తున్న ఈ పొడగరి పేసర్.. రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడు.
స్వదేశంలో భారత్‌ను పొట్టి సిరీస్‌లో వైట్‌వాష్ చేసిన ఇంగ్లండ్ వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఇదివరకు ప్రకటించిన స్క్వాడ్‌లో ఒక మార్పు చేస్తూ పేసర్ బ్రైడన్ కార్సేను ఎంపిక చేశారు సెలెక్టర్లు. మంగళవారం ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి వన్డే సమయంలోనే కార్సేను స్క్వాడ్‌లో చేర్చిన విషయాన్ని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
⚡️ England have added pacer Brydon Carse to their squad for the rest of the ODI series against India#ENGvIND pic.twitter.com/fd28766BHX
— Cricbuzz (@cricbuzz) July 14, 2026
నిరుడు నవంబర్‌లో న్యూజిలాండ్‌పై చివరి వన్డే ఆడిన కార్సే.. కుడిచేతికి గాయంతో 19వ సీజన్ ఐపీఎల్లో ఆడలేదు. ఇటీవలే కోలుకొని ఫిట్నెస్ సాధించిన స్పీడ్‌స్టర్ పునరాగమనం సిరీస్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటివరకూ 30 వన్డేల్లో 40.44 సగటుతో 34 వికెట్లు తీశాడు కార్సే. భారత్, ఇంగ్లండ్ మధ్య జూన్ 16న కార్డిఫ్‌లో రెండో వన్డే, జూలై 19న లార్డ్స్‌లో మూడో వన్డే జరుగనున్నాయి.
ఇంగ్లండ్ వన్డే స్క్వాడ్(అప్టేడెట్): హ్యారీ బ్రూక్(కెప్టెన్), బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), టామ్ బ్యాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, బ్రైడన్ కార్సే, జేమ్స్ కొల్స్, డాసన్, సకీబ్ మహమూద్, టంగ్, రెహాన్ అహ్మద్, ఆర్చర్, అట్కిన్సన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

