KCR | రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అరాచకపర్వం కొనసాగుతోంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి కాంగ్రెస్ గూండాలు బయల్దేరారు. కేసీఆర్‌పై జరుగుతున్న ఈ కుట్రలు తెలిసిన కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నఫళంగా అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి బయల్దేరారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. హకీంపేట వద్ద వారి వాహనాలను ఆపి అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద అగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంటికి కూడా మేం పోవద్దా అంటూ పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం నెలకొంది. పోలీసులు తమ వాహనాలను అడ్డుకోవడంతో బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవెల్లి వైపు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాదయాత్రగా బయల్దేరారు.
కాలి నడకన కేసీఆర్ నివాసానికి బయల్దేరిన కేటీఆర్, హరీష్ రావు
పోలీసులు తమ వాహనాలను అడ్డుకోవడంతో బొల్లారం చౌరస్తా నుండి ఎరవెల్లి వైపు పాదయాత్రగా నడుచుకుంటూ బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు https://t.co/1K9xGd1XUv pic.twitter.com/5AgB3L2Jvg
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
మరోవైపు, కేసీఆర్ చావును కోరుతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యానించడంపై బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్‌గా ఉన్నాయి. కేసీఆర్‌పై హత్యాయత్నానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు గుంపులుగా రావడంపై మండిపడుతున్నారు. ఎంత మందిని పోలీసులను పంపుతారో పంపండి ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారో రండి తేల్చుకుంటాం అంటూ బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఎర్రవెల్లికి బయల్దేరారు.
ఈ క్రమంలోనే యాదాద్రి జిల్లా నుంచి కేసీఆర్ నివాసానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. మార్కుక్ మండలం దామరకుంట వదవ్ద కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుని దేహశుద్ధి చేశారు. ఇక షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ దహనం చేశారు.
ఎర్రవెల్లి నివాసానికి వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలను హకీంపేట వద్ద అడ్డుకున్న పోలీసులు
మరోవైపు కాంగ్రెస్ గూండాలను దగ్గరుండి తీసుకెళ్తున్న వైనం https://t.co/bq2VwFLeLX pic.twitter.com/bA8kXcO8ak
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026