KCR | కేసీఆర్‌పై దాడికి బయలుదేరిన కాంగ్రెస్ గూండాలు.. అడ్డుకొని బుద్ధి చెప్పిన బీఆర్ఎస్ శ్రేణులు : వీడియో
KCR | కాంగ్రెస్ గుండాల దాడులను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. కేసీఆర్ మీద దాడి చేయడానికి యాదాద్రి జిల్లా నుంచి కేసీఆర్ నివాసానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను సిద్దిపేట జిల్లా మర్కుక్ దామరకుంట వద్ద అడ్డుకుని దేహశుద్ది చేశారు.
KCR | కాంగ్రెస్ గుండాల దాడులను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. కేసీఆర్ మీద దాడి చేయడానికి యాదాద్రి జిల్లా నుంచి కేసీఆర్ నివాసానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను సిద్దిపేట జిల్లా మర్కుక్ దామరకుంట వద్ద అడ్డుకుని దేహశుద్ది చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ బరితెగింపు రాజకీయాలక పాల్పడుతున్నది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేక సీఎం రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు తెరతీశాడు. ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై హత్యాయత్నానికి ప్లాన్ చేయడం సంచలనంగా మారింది.
ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడికి కాంగ్రెస్ గుంపు బయలుదేరి వెళ్లడం కలకలం రేపింది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారిక క్యాంపు కార్యాలయం నుంచి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడికి బయలుదేరిన వారిని పోలీసులు దగ్గరుండి సాగనంపుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. వ్యవసాయ క్షేత్రం మీదకు బయలుదేరిన వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
ఈ క్రమంలోనే కేసీఆర్ చావాలి, ఆయన చావు కోరుకుంటున్నాం అంటూ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడటంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ 144 సెక్షన్ విధించామని, ఎవరూ రావద్దని చెబుతున్న పోలీసులు మరోవైపు కాంగ్రెస్ గుండాలను పంపడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కేసీఆర్‌కు ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
కేసీఆర్ మీద దాడి చేయడానికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు దేహశుద్ది చేసిన బీఆర్ఎస్ శ్రేణులు
మర్కుక్ దామరకుంట వద్ద తీవ్ర ఉద్రిక్తత
యాదాద్రి జిల్లా నుంచి కేసీఆర్ నివాసానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకుని దేహశుద్ది చేసిన బీఆర్ఎస్ శ్రేణులు https://t.co/HRehoAnNB4 pic.twitter.com/cKMa1JuEHH
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
U-19 Asia Cup: ఆర్యావీర్ సెహ్వాగ్, లక్ష్య రాయిచందానీ హాఫ్ సెంచరీలు.. ఆసియా అండర్-19లో భారత్ బోణీ
Putta Madhukar | ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా కన్నీళ్లేనా? : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
AIADMK Leader Arrest | టీవీకే ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఎర.. ఏఐఏడీఎంకే నేత అరెస్ట్
మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ముదురుతున్న వివాదం.. గాంధీభవన్‌కు చేరిన పంచాయితీ!
Harish Rao | ఎండిపోయిన ప్రతి ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే.. హరీశ్‌రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

