Jason Gillespie: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వేల వేల డాలర్లు బాకీ ఉన్నది: జేసన్ గిలెస్పీ
Jason Gillespie : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తనకు వేలవేల డాలర్లు బాకీ ఉన్నట్లు మాజీ ఆసీస్ క్రికెటర్ జేసన్ గిలెస్పీ తెలిపారు. గతంలో పాక్ జట్టుకు గిలెస్పీ కోచ్‌గా చేశారు. అయితే పాక్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా ఆకిబ్ జావిద్‌ను నియమించిన తర్వాత ఆ జట్టు క్షీణించిందన్నారు.
సిడ్నీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌలర్ జేసన్ గిలెస్పీ(Jason Gillespie) గతంలో కోచ్‌గా చేశారు. అయితే ప్రస్తుతం పాక్ క్రికెట్లో జరుగుతున్న సంక్షోభ పరిణామాలపై గిలెస్పీ స్పందించారు. పాక్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా ఆకిబ్ జావిద్‌ను నియమించిన తర్వాత ఆ దేశ జాతీయ జట్టు క్షీణించినట్లు గిలెస్పీ పేర్కొన్నారు. పీసీబీ చైర్మెన్ మోషిన్ నఖ్వీ నియమించిన ఆకిబ్ జావిద్ తనకు నచ్చినట్లు వ్యవహరించాడని ఆసీస్ బౌలర్ ఆరోపించాడు. ఆకిబ్ నియామకంతో పాక్ క్రికెట్లో క్షీణ దశ మొదలైందని, అతని రాక తర్వాత పాక్ క్రికెట్‌తో తన రిలేషన్ కూడా మారిందన్నాడు. అప్పటి వరకు వరకు ఉన్న తన బాధ్యతలు, పాత్ర మారినట్లు చెప్పాడు. ఇది వ్యక్తిగతంగా కూడా తనను నిర్వీర్యం చేసిందన్నాడు.
ఆటగాళ్లు, సిబ్బంది సెలెక్షన్లో ఒకప్పుడు తన పాత్ర ఉండేదని, కానీ ఆకిబ్ జావిద్ వచ్చిన తర్వాత తన పాత్ర కనుమరుగైందన్నారు. అయితే ఇదంతా తన కోచింగ్ సామర్థ్యంపై దెబ్బపడినట్లు చెప్పాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంకా తన పరిహారాన్ని చెల్లించలేదని గిలెస్పీ ఆరోపించాడు. వేల వేల డాలర్లు బాకీ ఉన్నట్లు పేర్కొన్నాడు. తన సూత్రాలకు తాను కట్టుబడి ఉన్నానని, అందుకే ఆకిబ్ జావిద్ మార్పులను అంగీకరించలేదని, దాంతో పాక్ క్రికెట్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు గిలెస్పీ తెలిపాడు.
తన పట్ల ఆకిబ్ అమర్యాదగా ప్రవర్తించినట్లు గిలెస్పీ పేర్కొన్నాడు. ఆకిబ్‌కు పీసీబీ చైర్మెన్ అండదండలు ఉన్నాయని, జట్టు విషయంలో అతను ఎవరి సలహాలను స్వీకరించేవాడు కాదని ఆసీస్ క్రికెటర్ తెలిపాడు. పాక్ క్రికెట్ బోర్డులో ఆకిబ్ జావెద్ ఉన్నన్ని రోజులు.. ఆ జట్టు వెనక్కి వెళ్తూనే ఉంటుందని గిలెస్పీ అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

