న్యూఢిల్లీ, నవంబర్ 16: కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ట్విట్టర్లో వెల్లడించారు. ఈ కారిడార్… పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను మన దేశంలోని పంజాబ్ రాష్ట్రం గుర్దాస్పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ పుణ్యక్షేత్రాన్ని కలుపుతుంది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ దేవ్ తుది మజిలీ ప్రాంతం గురుద్వారా దర్బార్ సాహిబ్. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి సిక్కులు చేపట్టే ఈ తీర్థయాత్రను నిలిపివేశారు.