శంకరపట్నం, మార్చి 24: మండలంలోని మెట్పల్లి గ్రామంలో బాకారపు సమత (28) అనే వి వాహిత మహిళ ప్రమాదవశాత్తు వ్యవసాయ బా విలో పడి మృతి చెందింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన తోడంగ సారయ్య కూతురు సమతకు ఆరు సంవత్సరాల క్రితం మెట్పల్లికి చెందిన బాకారపు సదానందంతో వివాహమైంది. గురువారం ఉదయం భ ర్త సదానందం, అత్త ఐలమ్మతో కలిసి పొలం పను ల్లో భాగంగా సీడ్ వరి పువ్వు దులిపేందుకు వెళ్లిం ది.
ఈ క్రమంలో వ్యవసాయ బావి వద్ద గల తా డు తీసుకువచ్చేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారి పడ్డది. కొంత సేపటికి సమత భర్త సదానందం బావి వైపు వెళ్లి చూడగా బావిలో కొట్టుకుంటూ కనిపించింది. అతడు కేకలు వేయడంలో చుట్టు పక్కల రైతులు, గ్రామస్తులు చేరుకుని ఆమెను బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న హుజురాబాద్ రూరల్ సీఐ జనార్దన్, ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ మల్లారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని హుజూరాబాద్ దవఖానకు పోస్ట్మార్టం కోసం తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు సాత్విక్ (5), రుత్విక్ (3) ఉన్నారు. సమత తండ్రి తోడంగ మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ వెల్లడించారు.