రామడుగు, జూన్ 20 : మండలంలోని చిప్పకుర్తి ప్రాథమిక పాఠశాలకు చెందిన నాలుగో తరగతి విద్యార్థులు జుట్టు అక్షయ్, నముండ్ల రిషిత్, నముండ్ల గీతిక, కొత్తూరి కృప గురుకులాల్లో ప్రవేశం పొందారు. సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సెలేసినా ఆధ్వర్యంలో విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ గురుకులాల్లో సీట్లు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దీవించారు.
తిర్మలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో తిర్మలాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజిరెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, స్వరూప, ఎస్ఎంసీ చైర్మన్లు గోనెపెల్లి శేఖర్, రాజు, వార్డు సభ్యుడు త్రినాథ్‌వర్మ పాల్గొన్నారు.
రుద్రారం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సుధగోని శ్రీజవర్షిణి, ఔషధం సాత్విక, మామిడిపల్లి భవాని, చిలుముల హర్షవర్ధన్ 2012-22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కీమ్ స్కాలర్‌షిప్పునకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ సోమవారం ఎంపికైన విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ఇక్కడ ఎస్ఎంసీ చైర్మన్ చిలుముల లక్ష్మణ్, అశ్వక్ హుస్సేన్, కిషన్‌రావు, నాగేందర్, జయలక్ష్మి, శ్రావణ్‌కుమార్, పద్మజారాణి, కరుణాకర్‌రావు, కృపారాణి ఉన్నారు.