సిరిసిల్ల రూరల్, ఆగస్టు 20: ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి భరోసానిస్తుందని తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన గుర్రం అలేఖ్యకు రూ.21వేలు, కందుకూరి శ్రీనివాస్‌కు రూ.20 వేలు, తంగళ్లపల్లి శంకరయ్యకు రూ.8వేలు, కొమ్మెట వజ్రవ్వకు రూ.11వేలు, వేదశ్రీ కి రూ.39వేలు, బండి రేణుకకు రూ.16,500లు, గనప నారాయణరెడ్డికి రూ.40వేలు, బిజన్బీ కి రూ.13,500,లచ్చిరెడ్డికి రూ.17,000లు, మసూరి మమతకు రూ. 60వే లు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరయ్యాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు శనివా రం వారి నివాసాలకు వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సిరిసిల్ల సింగిల్‌విండో చైర్మన్ బండి దేవదాస్‌గౌడ్, సర్పంచ్ గనప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న, లింగం, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు డాక్టర్ నక్క రవి, ఉప సర్పంచ్ నాగరాజు, గనుప మదన్‌రెడ్డి, బుస్స లింగం, గుర్రం కిషన్‌గౌడ్, అమరగొండ ప్రశాంత్, ప్రభుదాస్ ఉన్నారు. అదే విధంగా చిన్నలింగాపూర్‌కు చెందిన రేగుల మల్లయ్య కు రూ.20వేలు, వంతడపుల పల్లవికి రూ.60వేలు సీఎం సహాయ నిధి కింద మంజూరుకాగా శనివారం వారి నివాసాలకు స ర్పంచ్ మాసిరెడ్డి అవినాష్‌రెడ్డి, నేతలు వెళ్లి చెక్కులను అందజేశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రేగుల అనిల్, ఏఎంసీ డైరెక్టర్ ఏనుగు రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీటీసీ శ్యాగ దేవేందర్, వర్కల మల్లేశం, యూత్ అధ్యక్షుడు పిట్ల భిక్షపతి, గుర్రం సతీశ్‌రెడ్డి, చికోటి మల్లేశం, చెప్యాల బాబు, మల్లికార్జున్ తదితరులు ఉన్నారు. బాలమల్లుపల్లెకు చెందిన నల్లవేణి ప్రవీణ్‌కు రూ.39 వేలు, బొడ్డు కవితకు రూ.22,500, కీర్తి గోవర్ధన్ కు రూ.60 వేలు సీఎం సహాయ నిధి కింద మంజూరవ్వగా, శనివారం వారికి చెక్కులను సర్పంచ్ కస్తూరి లత, తిరుపతిరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు యాదనరేశ్, వీరారెడ్డి నర్సయ్య, చంద్ర య్య, బాపురెడ్డి, లావణ్య, వేణు ఉన్నారు.
కోనరావుపేట, అగస్టు20: మండలంలోని పల్లిమక్త, నాగారం గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య అందజేశారు. ఆయా గ్రామాలకు చెందిన జల, నిర్మాల, అనిల్‌కు రూ.46 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇక్కడ సర్పంచులు బాస లావణ్య, జిన్న అనిల్, ఉపసర్పంచ్లు కిషన్గుప్తా, నాగరాజు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు జిన్న అనిల్ ఉన్నారు.