Fauzi | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి ‘ఫౌజీ`(Fauzi) ఒకటి. హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వీ (Imanvi) ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫౌజీ ఫస్ట్ లుక్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
శాండల్ వుడ్ భామ, సింగర్ ఛైత్ర జే అచర్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నట్టు షేర్ చేసింది ఛైత్ర జే అచర్. సప్త సాగరదాచె ఎల్లో, 3 బీహెచ్‌కే సినిమాల్లో నటించింది. హనురాఘవపూడి అద్భుతమైన క్రియేషన్ ఫౌజీ అని చెప్పింది ఛైత్ర జే అచర్. ఈ బ్యూటీ సర్ప్రైజ్ అప్డేట్ షేర్ చేసి ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 ఆగస్టులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ చేస్తున్నాడు. దీంతోపాటు సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చిత్రాలు ట్రాక్‌పై ఉన్నాయి.
Biopic | ఛావా డైరెక్టర్ కొత్త బయోపిక్ .. తెరపైకి ఫోక్ డాన్సర్ జీవిత చరిత్ర
Actor Vijay | విజయ్ వాహనాలన్నింటికీ 0277 నంబర్.. దాని వెనుక ఉన్న ఎమోషనల్ కథ తెలుసా..?
Sara Ali Khan | కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్న సారా అలీ ఖాన్.. ఫొటోలు