డిచ్పల్లి, మార్చి 14: మండలంలోని రాష్ట్ర ప్రత్యేక పోలీసు 7వ బెటాలియన్‌ను ప్రత్యేక పోలీస్ బె టాలియన్స్ అదనపు డీజీపీ అభిలాష బిష్త్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు కమాండెంట్ ఎస్వి.సత్యశ్రీనివాస్‌రావు ఘన స్వాగతం పలికారు. అనంతరం బెటాలియన్ సిబ్బంది వెల్ఫేర్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పోలీసు సబ్సిడీ క్యాంటీన్‌ను అడిషనల్ డీజీపీ ప్రారంభించారు. బెటాలియన్ మహిళలకు ప్రత్యేకంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీ పర్స్, జ్యూట్‌బ్యాగ్‌ల తయారీపై శిక్షణను సందర్శించి అభినందించారు. బెటాలియన్ ఆవరణలో సాండిల్ ఫుడ్ గార్డెన్ ప్రారంభించి మొక్కలు నాటారు. నేషనల్ హైవే నంబర్-44కు ఆనుకొని బెటాలియన్ ఆవరణ ఉన్న యూనిట్ పెట్రోల్‌బంక్‌లో ఏర్పాటు చేసిన ఐస్‌క్రీం పార్లర్‌ను ప్రారంభించారు.
బెటాలియన్‌లో నూతనంగా నిర్మించాల్సిన కమర్షియల్ కాంప్లెక్స్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్పీ-1 గేట్ ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. బెటాలియన్ అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలుసుకొని కమాండెంట్ సత్యశ్రీనివాస్రావును ఆమె అభినందించారు. అసిస్టెంట్ క మాండెంట్ ఎం. వెంకటేశ్వర్లు, కె. భాస్కర్‌రావు, టి.శ్రీదేవి, ఆర్ఐలు వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్, నరేశ్, శ్యాం రావు, ప్రహ్లాద్, వసంత్‌రావు, ఆర్ఎస్సైలు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.