బాన్సువాడ/ భిక్కనూరు/కామారెడ్డి/ నిజాంసాగర్/ తాడ్వాయి, మార్చి 14: రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు హైదరాబాద్‌కు తరలివెళ్లి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్‌లోని శాసనసభ భవనంలో మంత్రి వేములకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పుష్పగుచ్ఛాన్ని అందజేసి జనద్మిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని స్పీకర్ ఆశీర్వదించారు.
ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఆవరణలో మంత్రి వేములను కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి ప్రశాంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి వేములను హైదరాబాద్‌లోని నివాసంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ ఆధ్వర్యంలో కామారెడ్డి నేతలు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆధ్వర్యంలో కౌనిల్సర్లు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కామారెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, పట్టణ మాజీ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు మాసుల లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు గెరిగంటి లక్ష్మీనారాయణ, కనపర్తి అరవింద్, యూత్ నాయకుడు గడ్డం సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని టీఆర్ఎస్ తాడ్వాయి నాయకులు కలిశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో సీడీసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ముదాం నర్సింహులు ఉన్నారు.
భిక్కనూరు సౌత్‌క్యాంపస్ ప్రాంగణంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉప కులపతి ప్రొఫెసర్ రవీందర్ గుప్తా హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు, అధ్యాపకులు డాక్టర్ సుధాకర్ గౌడ్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ లలిత, డాక్టర్ హరిత, కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.