సదాశివనగర్, మార్చి 14 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సదాశివనగర్ మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియంలో ఓరియంటేషన్ ప్రోగ్రాంపై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఇంగ్లిష్ మీడియంపై ప్రభుత్వం అమలు చేస్తున్న తీరును కలెక్టర్ ఉపాధ్యాయులకు వివరించారు. ఆంగ్లమాధ్యమంలో బోధనపై విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ప్రత్యేక కార్యదర్శి సందీప్ సుల్తానియా, డైరెక్టర్ దేవీదాస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తోపాటు జిల్లాలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులకు శిక్షణ అందించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా విద్యాధికారి రాజు, మండల విద్యాధికారి యోసెఫ్, మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ భానుమతి, రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.