నమస్తే తెలంగాణ యంత్రాంగం, మార్చి 13: ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి, టీఎన్జీవోస్ అధ్వర్యంలో కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. మద్నూర్ మండలం శేఖాపూర్‌లో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే కేక్ కట్‌చేసి కవితకు శుభాకాంక్షలు తెలిపారు. నిజాంసాగర్ మండలం మహ్మద్‌నగర్ గ్రామంలో జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి సంబురాలు నిర్వహించారు. బాన్సువాడలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన కవిత.. ఆడబిడ్డలందరి దీవెనలతో నిండు నూరేండ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోటీఆర్ఎస్ యూత్ నాయకుడు గడ్డం సురేందర్ రెడ్డి అధ్యర్యంలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్సీ కవితను జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మనోహర్‌రెడ్డి హైదరాబాద్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజాంసాగర్, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడప్గల్, పిట్లం, లింగంపేట, నాగిరెడ్డిపేట్, బాన్సువాడ, మాచారెడ్డి, కామారెడ్డి మండలాల్లో స్థానిక టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సంబురాలు కొనాసాగాయి.