లింగంపేట/గాంధారి/నాగిరెడ్డిపేట్/భిక్కనూరు/ బాన్సువాడ రూరల్/ మాచారెడ్డి, మార్చి 13: జిల్లాలోని పలు గ్రామాల్లో ఉపాధిహామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు. లింగంపేట మండల కేంద్రం లోని మూడో వార్డులో రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను టీఆర్ఎస్ యూత్ విభాగం మండల అధ్యక్షుడు సుప్పాల నరేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ నరహరి, యూత్ పట్టణ అధ్యక్షుడు సాదిక్ ప్రారంభించారు. గాంధారి మండలకేంద్రంలో రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను జడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ రాధాబలరాం, సర్పంచ్ మమ్మాయి సంజీవ్ ప్రారంభించారు.
నాగిరెడ్డిపేట్ మండలం రాఘవపల్లితండాలో రూ. ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను ఎంపీపీ రాజదాస్, సర్పంచ్ వెంకట్రాంరెడ్డి ప్రారంభించారు. భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్‌లో రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ గాల్‌రెడ్డి, సర్పంచ్ స్వామి ప్రారంభించారు. మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్‌తండా, ఎక్స్‌రోడ్ గ్రామంలో రూ.5 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు ప్రారంభించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ శివారులో పీఎస్ఆర్ కాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు.