నిజాంసాగర్/నాగిరెడ్డిపేట్/గాంధారి/ఎల్లారెడ్డి/లింగంపేట/తాడ్వాయి/బీర్కూర్/కామారెడ్డి రూరల్/దోమకొండ, అక్టోబర్ 21 : వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాల్లో గురువారం టీకాల పంపిణీ కొనసాగింది. నిజాంసాగర్ మండలం మల్లూర్ గ్రామంలో వ్యాక్సినేషన్‌ను ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అనిల్ పరిశీలించారు. మండలంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయడంపై వైద్యారోగ్య సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట మండల వైద్యాధికారి రాధాకిషన్, ఎంపీవో అబ్బాగౌడ్ తదితరులు ఉన్నారు.
నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ గ్రామంలో కొనసాగుతన్న వ్యాక్సినేషన్‌ను మెడికల్ ఆఫీసర్ నందిత, ఎంపీవో శ్రీనివాస్ పరిశీలించారు. గాంధారి మండంలోని అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నదని మండల వైద్యాధికారి హరికృష్ణ తెలిపారు ఇప్పటి వరకు 33,792 మందికి టీకాలు వేశామని వివరించారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానలో తాజాగా 18 మందికి ఫస్ట్‌డోస్, మరో 18 మందికి సెకండ్ డోస్ టీకాలు వేశారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి 238 మందికి కొవిడ్ టీకాలను వేశారు. లింగంపేట మండలంలో మండలంలో మొత్తం 320 మందికి టీకాలు వేసినట్లు పీహెచ్సీ వైద్యురాలు సమీనా తెలిపారు. ఇందులో 226 మందికి ఫస్ట్ డోస్, 94 మందికి సెకండ్ డోస్ టీకాలు వేసినట్లు వివరించారు. తాడ్వాయి మండలంలోని పలుగ్రామాల్లో 247 మందికి కొవిడ్ టీకాలు వేశారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ టీకావేసుకోనివారికి అవగాహన కల్పిస్తున్నారు. మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని తహసీల్దార్ సునీత సూచించారు. బీర్కూర్ మండల కేంద్రంలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మండల ప్రత్యేకాధికారి నర్సారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాధ, ఎంపీవో అనిత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఏఎన్ఎం సునీత తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామంలో ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సినేషన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో నాగేశ్వర్రావు, ఎంపీవో మల్హరీ గ్రామంలో పర్యటించి పంచాయతీ రికార్డులు పరిశీలించారు. పల్లెప్రకృతి వనం, హరిత వనాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అధికారుల వెంట జీపీ కార్యదర్శి గణేశ్ ఉన్నారు.
దోమకొండ మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో గర్భిణులు, బాలింతలకు వైద్య సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం రాజేందర్, సీసీ రాజేశం, సర్పంచ్ స్వరూప, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.