కోటగిరి, నవంబర్ 16 : మండలంలోని ఎత్తొండ కాంగ్రెస్ ఎంపీటీసీ అగ్గు కల్పనతోపాటు ఆ పార్టీకి చెందిన 20 మంది నాయకులు, కార్యకర్తలు మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ..అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ పకడ్బందీగా అమలు చేస్తున్నారని అన్నారు. ఎంపీటీసీ కల్పన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులమై టీఆర్ఎస్లో చేరామన్నారు. అనంతరం హంగర్గాఫారం దర్గాలో చాదర్ కప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌పటేల్, స్థానిక సర్పంచ్ సాయిబాబా, ఉప సర్పంచ్ సుజాత దేవేందర్‌రావు, ఎంపీటీసీ ఫారుఖ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాజ్‌ఖాన్, నీరడి గంగాధర్, సిరాజ్, వల్లెపల్లి శ్రీనివాస్‌రావు, నాయకులు పాల్గొన్నారు.