Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Kalvala Project | శంకరపట్నం, వీణవంక మండలాల కల్పవల్లి.. కల్వల ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు అంతులేని అలసత్వం చూపుతున్నది. మూడేళ్ల క్రితం మత్తడికి గండి పడగా, మరమ్మతులు చేయించడంలో తీవ్ర అలసత్వం చేస్తున్నది.
Kalvala Project | శంకరపట్నం, వీణవంక మండలాల కల్పవల్లి.. కల్వల ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు అంతులేని అలసత్వం చూపుతున్నది. మూడేళ్ల క్రితం మత్తడికి గండి పడగా, మరమ్మతులు చేయించడంలో తీవ్ర అలసత్వం చేస్తున్నది. ఫలితంగా వానకాలం చుక్క నీరు నిలువకుండా దిగువకు వృథాగా పోగా, నీటి కోసం రైతులు, ఉపాధి లేక మత్స్యకారులు అవస్థలు పడ్డారు. ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి శాశ్వత మరమ్మతులు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గళమెత్తినా, మాజీ ఎమ్మెల్యే రసమయి హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శంకరపట్నం, అక్టోబర్ 22: కల్వల ప్రాజెక్టు శంకర పట్నం, వీణవంక మండలాల జీవనాడి. ఈ రెండు మండ లాల పరిధిలో 1200 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుంది. అయితే 2023 జూలైలో పడిన భారీ వర్షాల ధాటికి మత్తడి గండి పడి, కోతకు గురైంది. అప్పట్లో అధికారులు రింగ్ బండ్ వేసి తాత్కాలికంగా మరమ్మతులు పూర్తిచేశారు. కానీ, ఏడా దికే మళ్లీ గండి పడి చుక్క నీరు నిలువకుండా ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయింది. అప్పట్లో నీళ్లు నిలిచే పరిస్థితి లేకపో వడంతో ఆయకట్టు రైతులే స్వయంగా ముందుకువచ్చి, ట్రాక్టర్ల ద్వారా ఇసుక బస్తాలు అడ్డుగా వేసి తాత్కాలిక మర మ్మతులు చేసుకున్నారు. కానీ, వరద ఒత్తిడికి ఫలితం లేకుండా పోయింది. మళ్లీ గండి ఏర్పడింది. రెండేళ్లుగా వెల వెలబోయి కనిపిస్తున్నది. ప్రాజెక్టు దిగువన ఉన్న ఐదు చెక్ డ్యామ్ ల్లోనూ నీటి ఊట లేక ఎండిపోవడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుపై ఆధారపడి బతుకుతున్న వంద లాది మంది మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయింది. నీటి నిల్వ లేకపోవడం, చేపల పెంచే అవకాశం లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక అరిగోస పడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రాజెక్టు ఎండిపోవడాన్ని అవకాశంగా మలు చుకున్న కొంతమంది అక్రమార్కులు, శిఖం భూములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. కొద్దిరోజుల కింద కొందరు ట్రాక్టర్లతో ప్రాజెక్టు భూములను చదును చేస్తూ అక్ర మంగా సాగు చేసే ప్రయత్నాలు చేయగా, అధికారులు వచ్చి అడ్డుకుంటున్నారు.
అసెంబ్లీలో ప్రస్తావించినా పట్టింపు కరువే
కల్వల ప్రాజెక్టు దుస్థితి, ఆయకట్టు రైతుల సాగునీటి గోసపై ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టుపై ఆధా రపడి ఎందరో రైతులు, మత్స్యకారులు బతుకుతున్నారని గండి పడి మూడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. గతంలో ప్రాజెక్టుకు గండి పడినప్పుడు భారీగా నిధులు కేటాయించి శాశ్వత ప్రాతిపదికన మరమ్మ తులు చేపట్టి మినీ ఎల్ఎండీగా మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరిచిపోయిందని మండిప డ్డారు. తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నిర్లక్ష్యంపై మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రస మయి బాలకిషన్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల ఆయకట్టు, ఎండిపోతున్న చెక్ డ్యామ్‌లను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదుకోవాలని వేడుకోలు
ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చూపడంపై రైతులు మత్స్యకారులు ఆగ్రహిస్తున్నారు. శాశ్వత మరమ్మతులు చేయాలని రెండేండ్లుగా కోరుతున్నా ఏ మాత్రం పట్టించుకో వడం లేదని మండిపడుతున్నారు. అధికార మార్పిడితో ప్రాజెక్టు పునరుద్ధరణ అటకెక్కిందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి తక్షణమే ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని, శాశ్వత ప్రాతిపది కన మరమ్మతులు చేసి ఆయకట్టు రైతులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

