Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Anirudh-Kavya | తమిళ సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ పలు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. నవంబర్ 11న పెళ్లి, నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
Anirudh-Kavya | తమిళ సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ పలు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. నవంబర్ 11న పెళ్లి, నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ వేడుకలకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరవుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ వివాహ తేదీలు, వేడుకల వివరాలపై ఇరువైపుల నుంచి అధికారిక ప్రకటన వెలువడినట్లు స్పష్టత లేదు.
అనిరుధ్, కావ్య మారన్ వివాహానికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే నవంబర్ 21న చెన్నైలో నిర్వహించనున్నట్లు ప్రచారంలో ఉన్న రిసెప్షన్‌కు మాత్రం సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే అవకాశం ఉందని సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముందుగా ఈ జంట వివాహం అనంతరం రెండు మూడు రిసెప్షన్లు నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మాత్రం వేడుకల ప్రణాళికలో మార్పులు చోటుచేసుకున్నాయని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. వివాహ వేడుకల సందర్భంగా అనిరుధ్ తన సన్నిహిత స్నేహితుల కోసం ప్రత్యేకంగా ఓ గెట్టుగెదర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 22న చెన్నైలోని ఐటీసీ చోళా హోటల్లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి.
ఇది అధికారిక రిసెప్షన్ కాదని, స్నేహితులతో కలిసి సమయం గడిపేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సమావేశమని సమాచారం. ఇక సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తన సంస్థ ఉద్యోగుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేయవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. అనిరుధ్ రవిచంద్రన్‌కి తమిళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన సంగీతం అందించిన సినిమాలు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాయి. మరోవైపు కావ్య మారన్ పేరు కూడా క్రికెట్, వ్యాపార రంగాలతో ముడిపడి ఉంది. దీంతో వీరి వివాహ వేడుకలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

