Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Krishnaraj | కోలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ (76) అనారోగ్యంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తన ప్రత్యేకమైన గాత్రంతో తమిళ సినీ సంగీత ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
Krishnaraj | కోలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ (76) అనారోగ్యంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తన ప్రత్యేకమైన గాత్రంతో తమిళ సినీ సంగీత ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇటీవల కన్నుమూసిన సంగీత దర్శకుడు దేవాకు కృష్ణరాజ్ ఎంతో ఇష్టమైన గాయకుడు కావడం గమనార్హం. తన సంగీత ప్రయాణంలో ఆయన తమిళంలో 300కు పైగా పాటలు ఆలపించారు. కృష్ణరాజ్ తన గాత్రంతో ఎన్నో మధురమైన పాటలకు ప్రాణం పోశారు. ఆయన పాడిన ‘తిరుపతి ఏళుమలై వెంకటేశా’, ‘కాత్తు అడిక్కుదు’, ‘సిరిచ్చిట్టు పోనాలుమ్’ వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మురళి కథానాయకుడిగా నటించిన ‘పొర్కాలం’ చిత్రంలోని ‘తంజావూరు మన్ను ఎడుత్తు’ పాట ఆయనకు మంచి పేరు, గుర్తింపును తీసుకొచ్చింది.
2000 సంవత్సరం తర్వాత కూడా ఆయన తన గాన ప్రయాణాన్ని కొనసాగించారు. ‘పరుత్తివీరన్’ చిత్రంలో ‘అయ్యయ్యో’, ‘కళుగు’ సినిమాలో ‘ఆంబైకు పొంబైకు’ వంటి పాటలు పాడారు. సూర్య నటించిన ‘సూరరై పోట్రు’ చిత్రంలోనూ ఆయన తన స్వరాన్ని అందించారు. విభిన్నమైన గాత్రంతో పలు తరాల సంగీతాభిమానులను అలరించిన కృష్ణరాజ్ మరణం తమిళ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా నిలిచింది. కృష్ణరాజ్ భౌతికకాయాన్ని ప్రజలు, సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని వలసరవాక్కంలోని ఆయన నివాసంలో ఉంచారు. అనంతరం ఆయన స్వగ్రామమైన సేలం జిల్లాలోని వీరపాండి పంచాయతీ పరిధిలో ఉన్న వేంబడిదళం గ్రామానికి తరలించనున్నారు. శుక్రవారం అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
గాయకుడు కృష్ణరాజ్ మృతిపట్ల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా సంతాప సందేశాన్ని పంచుకున్నారు. నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ మరణవార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు దేవా మరణించిన కొద్ది రోజులకే ఆయనకు ఇష్టమైన గాయకుడు కూడా కన్నుమూయడం మరింత బాధాకరమని తెలిపారు. కృష్ణరాజ్ మరణం తమిళ చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ, విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందినవారు, సంగీతాభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పలువురు సినీ ప్రముఖులు కూడా కృష్ణరాజ్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

