రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్‌లో సినీ నిర్మాత కలిపి మధు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సినీనటులు ఆదర్శ్ బాలకృష్ణ, నవదీప్, వెన్నెల కిషోర్‌లకు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.