KAKATHIYA UNIVERSITY | హనుమకొండ చౌరస్తా, మార్చి 29 : కాకతీయ విశ్వవిద్యాలయం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.428.82 కోట్లతో అంచనా బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన విశ్వవిద్యాలయ సెనెట్హాల్లో శనివారం 40వ అకాడమిక్ సెనెట్ సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, అకాడమిక్ సెనెట్ సభ్యుల సమక్షంలో విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర విభాగ ప్రొఫెసర్, దూరవిద్యాకేంద్ర సంచాలకులు, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లు, ఉద్యోగ విరమణ భత్యాలు, నిర్వహణ ఖర్చులు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలకు, ఇతర ఖర్చులకు రూ.369.21 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో రాష్ర్ట ప్రభుత్వ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.195.62 కోట్లు కాగా ఇతర వనరులు నుంచి రూ.170.55 కోట్లు రాబడి వస్తుందని వారు అంచనా వేశారు. వీటిలో యూజీసీ ఎరియర్స్ రూపంలో రూ.32.81 కోట్లు, అకాడమిక్, ట్యుషన్ ఫీజుల రూపంలో రూ.8 కోట్లు, అంతర్గత వనురులు ద్వారా రూ.41.80 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ.50.06 కోట్లు ముఖ్యంగా ఉన్నాయి.
ఖర్చులను, రాబడులను ప్రొఫెసర్ సురేష్‌లాల్ 8 అంశాల్లో చూపించారు. అదే సమయంలో రూ.2.45 కోట్లు లోటు ఉంటుందని వెల్లడించారు. ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు రూ.211.41 కోట్లు, నిర్వహణ కార్యక్రమాలకు రూ.8.80 కోట్లు, పరీక్షలకు రూ.50.06 కోట్లు, అకాడమిక్ కార్యక్రమాలకు రూ.8.36 కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.84.38 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.ప్రతాప్‌రెడ్డి తన రిపోర్ట్‌లో విశ్వవిద్యాలయ అభివృద్ధిలో అందరి కృషి ఉందని అన్నారు. బాధ్యతతో విశ్వవిద్యాలయానికి ముందుకు తీసుకోని వెళ్తామని, 2026లో విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవంలోనికి అడిగిడుతుందని, నూతన కోర్సులు, జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా తీసుకోని వస్తామని, బోర్డు ఆఫ్ స్టడీస్‌లను బలోపేతం చేస్తామని, సిలబస్‌లలో మార్పులు, డిజిటలీకరణ దిశగా అడుగులు ఉంటాయన్నారు.
10 సంవత్సరలల్లో 3000 రిసెర్చ్ పత్రాలు గొప్ప ఇండెక్స్‌తో వచ్చాయని, 5 సంవత్సరాలలో 65 ప్రాజెక్టులు, 85 మంది విద్యార్థులు జాతీయస్థాయి పరీక్షల అర్హత సాందించారని, రుసా నిధులతో వ్యక్తిగత ప్రాజెక్ట్‌లు, డిపార్టుమెంట్ ప్రాజెక్ట్‌లు తీసుకోని వస్తున్నట్లు, 2025లో కే-హబ్‌ను వాడుకలోనికి తీసుకోని వస్తున్నట్లు, 6వ జనరేషన్, మెషిన్ లెర్నింగ్, మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు తీసుకోని వస్తామని, న్యాక్-ఏ ప్లస్, ఎన్.ఐ.ఆర్. ఎఫ్ ర్యాంక్, యు.ఐ గ్రీన్ మెట్రిక్ ర్యాంక్‌లలో కలిగి ఉందని, పూర్వవిద్యార్థులు సహకారంతో కొత్తగూడెంలో అకాడమిక్ బ్లాక్ నిర్మాణం జరిగిందని, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా జెన్కో రూ.1 కోటి రూపాయలు అందించిందని, ఇన్ఫోసిస్ సంస్థ నుంచి దశలవారిగా 300 కంప్యూటర్లు అందుకుందని, హరితాహారంలో భాగంగా 11 వేల మొక్కలు కాంపస్‌లో నాటినట్లు తెలిపారు.
ఎన్.ఎస్.ఎస్. ద్వారా పెద్దఎత్తున రక్తదాన సేకరణ జరిగిందని, ఇంజనీరింగ్ కాలేజీల్లో 195 ప్రాంగణ నియామకాలు జరిగిన్నట్లు, కామర్స్ విభాగంలో 90 జరిగినట్టు వెల్లడించారు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు, నైపుణ్య శిక్షణ చేపట్టనున్నట్లు, టీచింగ్ నియామకాలకు, విద్యార్ధి టీచర్ నిష్పత్తి అమలకు కృషి చేస్తున్నట్లు, పూర్వ విద్యార్థులు నుంచి ఫండ్స్‌కు కృషి చేస్తామని, పూర్వపు వైస్ ఛాన్సలర్ల సేవలు మరువలేనవన్నారు.
బడ్జెట్‌పై పాలక మండలి సభ్యులు పుల్లురి సుధాకర్, కె.అనితారెడ్డి, చిర్రా రాజు, పూర్వపు వైస్ ఛాన్సలర్ ఆచార్య విద్యావతి, ఆచార్య లింగమూర్తి, మాణిక్యం, డీన్ ఆచార్య హనుమంతు, ఆచార్య ఎన్.రామనాధకిషన్ మాట్లాడారు. అనంతరం బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది.