Jyothika | సాయిపల్లవి అభిమాన నటి జ్యోతిక. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తపరిచింది కూడా. రీసెంట్గా సాయిపల్లవి కథానాయికగా నటించిన ‘అమరన్’ సినిమాను జ్యోతిక వీక్షించి.. సినిమాపై తన అభిప్రాయాన్ని ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. దానిపై సాయిపల్లవి కూడా రియాక్టయ్యారు. దాంతో ఇన్‌స్టా వేదికగా వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది.
‘అమరన్’ సినిమా అద్భుతంగా ఉంది.. ముఖ్యంగా ైక్లెమాక్స్‌లో సాయిపల్లవి యాక్టింగ్ సూపర్.’ అని జ్యోతిక పోస్ట్ చేయగా.. దీనిపై సాయిపల్లవి స్పందిస్తూ ‘మీ అభినందనలు నాకెంతో విలువైనవి. మీకు సినిమా నచ్చినందుకు ఆనందంగా ఉంది. మీరు ‘అమరన్’ చూస్తున్నారని టీమ్ ద్వారా తెలిసినప్పట్నుంచీ మీకు నచ్చుతుందో, లేదో అని కంగారు పడ్డాను.’ అని పోస్ట్ చేసింది సాయిపల్లవి.
ఈ పోస్ట్‌పై జ్యోతిక రిప్లయ్ ఇస్తూ.. ‘సాయి.. నువ్వు గొప్ప నటివి. నీ వర్క్ నాకెప్పుడూ నచ్చుతుంది. ఎల్లప్పుడూ నిన్ను ఇష్టపడుతూనే ఉంటాను. ఆచీతూచి పాత్రల్ని ఎంచుకుంటావ్. వాటికి పూర్తి న్యాయం చేస్తావ్. అందుకే నువ్వు నాకెప్పుడూ స్పెషల్.’ అన్నారు జ్యోతిక. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.