Jr NTR | ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు తారక్. ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి గడిపేందుకు టైం కేటాయిస్తుంటాడు. వీలు చూసుకొని వెకేషన్స్ ప్లాన్ కూడా చేస్తాడు. తాజాగా న్యూఇయర్ సమీపిస్తున్న నేపథ్యంలో వెకేషన్ ప్లాన్ చేశాడు తారక్. ఇంతకీ ఎక్కడికెళ్లాడనే కదా మీ డౌటు.
జపాన్ కంట్రీకి వెళ్లింది తారక్ ఫ్యామిలీ. ఎయిర్‌పోర్టులో తారక్ తన సతీమణి పిల్లలతో కలిసి వెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న దేవర చిత్రానికి కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. దేవరలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. దేవర అండ్ గ్యాంగ్‌పై సెలబ్రేషన్ మ్యూజిక్ బిట్ ఉండబోతున్నట్టు చెప్పి.. సూపర్ కిక్ ఇచ్చే అప్డేట్ అందించింది కొరటాల టీం. మరోవైపు తారక్ సెట్స్‌లో డ్యాన్సర్లతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఇప్పటికే నెట్టింట వైరల్ అన్నాయి. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఎయిర్‌పోర్టులో తారక్ ఫ్యామిలీ…
Our @tarak9999 Annayya #Devara Glimpse Will Release In January 2nd Week Ani Talk Let’s See ❤️🔥🗡️👑.#JrNTR #ManOfMassesNTR pic.twitter.com/X09RFYNGMv
— NTR Wallpapers (@NTRWallpapers) December 25, 2023
Young tiger man of masses #JrNTR 🔥off for new year vacation #Devara@tarak9999 pic.twitter.com/HeP5YeMynU
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) December 25, 2023