ముంబై: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ దుమ్మురేపుతున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతను ప్రస్తుతం 5 మ్యాచుల్లో 272 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు. గురువారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆరంభంలో బట్లర్ ఇరగదీశాడు. కేవలం 23 బంతుల్లోనే అతను 50 రన్స్ చేశాడు. అయితే పేస్ బౌలర్ లాకీ పెర్గూసన్ తెలివైన బౌలింగ్‌తో బట్లర్‌ను బోల్తా కొట్టించాడు. ఆరవ ఓవర్ అయిదో బంతిని బట్లర్ సిక్సర్‌గా మలిచాడు. ఇక ఆరో బంతిని ఫెర్గూసన్ చాలా తెలివిగా వేశాడు. స్లో లెగ్ కటర్‌తో బట్లర్‌ను ఖంగుతినిపించాడు. ఇదే టోర్నీలో జరిగిన ఓ మ్యాచ్‌లోనూ బట్లర్ ఇలాగే స్లో యార్కర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిచర్డ్సన్ వేసిన స్లో బంతిని బట్లర్ అంచనా వేయలేక ఔటయ్యాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్పై 37 రన్స్ తేడాతో గుజరాత్ జట్టు గెలిచింది.
Jos Buttler X Slower ball pic.twitter.com/m0qkktCk4c
— Mohammed Asif (@Klassy__KL) April 14, 2022