నల్లగొండ, జనవరి 29 : నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో నల్లగొండ పట్టణంలోని 5వ డివిజన్‌కు చెందిన పున్న రాజేశ్వరి వెంకన్న, నల్లగొండ అశోక్, వనపర్తి రాము, చామల వంశీకృష్ణ, చిలుకూరు ప్రసాద్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కంచర్ల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, జమాల్ ఖాద్రి, కందుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Nalgonda : కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు