Cricket Australia : మహిళల ప్రీమియర్ లీగ్‌తో యువ క్రికెటర్ల సుడి తిరుగుతోంది. ఈ మెగా టోర్నీలో సంచలన ప్రదర్శనతో వరుసగా జాతీయ జట్టుకు ఎంపికవుతున్నారు. గుజరాత్ జెయింట్స్ హిట్టర్ భారతి ఫుల్మావి టీమిండియా జెర్సీ వేసుకోనుంది. ఇప్పుడు 19 ఏళ్ల లూసీ హామిల్టన్ (Lucy Hamilton) ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికైంది. త్వరలోనే స్వదేశంలో భారత జట్టుతో జరుగనున్న ఏకైక టెస్టుకు ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు. డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హామిల్టన్ ఈ మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయనుంది.
ఫిబ్రవరిలో భారత జట్టుతో మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా స్క్వాడ్‌ను ప్రకటించింది. స్వదేశంలో ఈ సిరీస్‌తో వీడ్కోలు పలుకనున్న అలీసా హీలీ(Alyssa Healy) వన్డే, టెస్టులకు సారథిగా.. సోఫీ మొలినెక్స్(Sophie Molineux) టీ20లకు కెప్టెన్‌గా వ్యవహిరించనున్నారు. అండర్ -19 వరల్డ్‌కప్‌లో, మహిళల బిగ్‌బాష్ లీగ్లోఅదరగొట్టిన లూసీ హామిల్టన్.. మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాణించడంతో టెస్టులకు తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ తరఫున ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంటున్న నికోలా కారీ కూడా వన్డే, టీ20ల స్క్వాడ్‌లో చోటు దక్కించుకుంది.
Introducing our @AusWomenCricket squads for the upcoming NRMA Insurance multi-format series against India 🇦🇺 🇮🇳 pic.twitter.com/GrNpa6tbbz
— Cricket Australia (@CricketAus) January 28, 2026
Welcome to TATA WPL, Lucy Hamilton! 🙌
The young Australian all-rounder went all-guns-blazing, guiding DC to a fiery finish! 🔥#TATAWPL, #DCvRCB | LIVE NOW ➡️ https://t.co/4hTwxURDzO pic.twitter.com/sxkQ3PGaSg
— Star Sports (@StarSportsIndia) January 17, 2026
ఆస్ట్రేలియా టీ20 స్క్వాడ్ : డార్సీ బ్రౌన్, నికోలా కారీ, అష్లే గార్డ్నర్, కిమ్ గార్త్, గ్రేస్ హ్యారిస్, ఫొబే లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మొలినెక్స్(కెప్టెన్), బేత్ మూనీ, ఎలీసా పెర్రీ, మేగన్ షట్, అనాబెల్ సథర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వరేహం.
ఆస్ట్రేలియా వన్డే స్క్వాడ్ : డార్సీ బ్రౌన్, నికోలా కారీ, అష్లే గార్డ్నర్, కిమ్ గార్త్, అలీసా హీలీ(కెప్టెన్), అలనా కింగ్, ఫొబే లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మొలినెక్స్, బేత్ మూనీ, ఎలీసా పెర్రీ, అనాబెల్ సథర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వరేహం.
ఆస్ట్రేలియా టెస్టు స్క్వాడ్ : డార్సీ బ్రౌన్, అష్లీ గార్డ్నర్, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, అలీసా హీలీ(కెప్టెన్), అలనా కింగ్, ఫొబే లిచ్‌ఫీల్డ్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మొలినెక్స్, ఎలీసా పెర్రీ, అనాబెల్ సథర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వరేహం.
Our NRMA Insurance Test squad that will take on India at the WACA in Perth in a day/night four-day Test ⬇️ pic.twitter.com/CAdzOhwZBn
— Cricket Australia (@CricketAus) January 28, 2026
క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బియర్డ్ మాట్లడుతూ ‘సోఫీ మొలినెక్స్ ప్రతిభగల క్రికెటర్. అనుభవంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్నందున ఆమెకు కెప్టెన్నీ ఇచ్చాం. ఆస్ట్రేలియా జట్టును ఆమె నడిపించడం చూసేందుకు అందరం ఎదురుచూస్తున్నాం. హీలీ వీడ్కోలు అనంతరం మొలినెక్స్ వన్డే, టెస్టు పగ్గాలు కూడా చేపట్టనుంది’ అని వెల్లడించాడు. ఫిబ్రవరి 15న టీ20 సిరీస్ మొదలవ్వనుంది. అనంతరం ఫిబ్రవరి 24, 27, మార్చి 1న వన్డే సిరీస్ జరుగుతుంది. మార్చి 6వ తేదీ నుంచి పెర్త్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుతో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా తలపడనుంది.