అలంపూర్: అలంపూరు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ఈనెల 7నుంచి 15వ తేది వరకు నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించారు. ఉభయ ఆలయాలను నీటితో శుద్ధి చేశారు.
ఆలయం శుద్ధి కారణంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భక్తులకు దర్శన సౌకర్యం కలుగలేదు. సాయంత్రం 6:30గంటల తర్వాత సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు.