జగిత్యాల : రెండు దశాబ్దాలుగా సాంకేతిక విద్యా,ఉపాధి కల్పనతోపాటు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న జగిత్యాల జేఎన్టీయూ ( Jagtia JNTU ) ఇంజినీరింగ్ కళాశాలను యూనివర్సిటీ ( University ) గా అప్‌గ్రేడ్ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ( Jeevan Reddy ) కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంగళవారం లేఖను రాశారు. జగిత్యాల ఇంజినీరింగ్ కళాశాలలో ప్రతి ఏటా 1,500 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరుతున్నారని వివరించారు.
అధునాతన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ, ల్యాబ్‌తో పాటు ఆటానమస్ భవనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాంపస్ ప్లేస్మెంట్లు, నాక్ ఏ ప్లస్ గుర్తింపు సాధించి 2023-24 విద్యా సంవత్సరంలో ఆటానమస్ కళాశాల గుర్తింపు సాధించిం దన్నారు. సాంకేతికపరమైన విద్యా, పరిశోధన క్షేతస్థాయిలో విస్తరించాల్సిన నేపథ్యంలో అన్ని రకాల విద్యావనరులు, సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న జగిత్యాల కళాశాలను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.