– ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ, సెప్టెంబర్ 29 : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నవంబర్ 13-15 నిర్వహించనున్న 45వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన సర్క్యులర్‌ను వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ద్వారా దక్షిణ భారత చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. సమ్మేళనం ద్వారా విలువైన చారిత్రక అంశాలను వెలుగులోకి తీసుకురావాలని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చరిత్రకారులు పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, డా.అరుణప్రియ, డా.శ్రీదేవి, డా.హరీష్‌కుమార్, ఆచార్య వసంత, ఆచార్య రఘురామారావు, డా.వై.ప్రశాంతి, ఆచార్య అలువాల రవి, ఆచార్య శ్రీనివాస్, చరిత్ర విభాగ అధ్యాపకులు ఆచార్య విజయబాబు, డా.పనస రామకృష్ణ, డా.షరీఫ్, డా.శ్రీనివాస్, వివేక్, డా.జక్కా సురేష్‌రెడ్డి, డా.హైమావతి, డా.శివరాం, డా.సబినా హెరాల్డ్ పాల్గొన్నారు.